Emergency Brain Surgery for Sadguru Jaggi Vasudev
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్
మెదడులో ప్రాణాంతక రక్తస్రావం కావడంతో , ఢిల్లీలోని
ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారని,
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సీనియర్ వైద్యులు బుధవారం ఒక ప్రకటనలో
తెలిపారు.
గత నాలుగు వారాలుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో
బాధపడుతున్నారని ఆసుపత్రి తెలిపింది. నొప్పి తీవ్రత ఉన్నా, ఆయన తన
సాధారణ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించారు. ఆ సమస్యతోనే ఈ నెల 8న మహా
శివరాత్రి వేడుకల్లో కూడా పాల్గొన్నారు.
బుధవారం సద్గురు ఆసుపత్రి నుంచే ఒక వీడియోను తన
ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో సద్గురు మాట్లాడుతూ,“అపోలో
ఆసుపత్రి న్యూరో సర్జన్లు నా పుర్రెను కత్తిరించి ఏముందో కనుగొనడానికి
ప్రయత్నించారు, కాని అందులో ఏమీ లేదు – పూర్తిగా ఖాళీగా ఉంది’’ అని
జోక్ చేసారు.
గురు జగ్గీవాసుదేవ్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
సంభాషించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని సందేశానికి సద్గురు ఆయనకు
ధన్యవాదాలు తెలిపారు.