అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళుతున్నాయి. దేశీయంగానూ అనుకూల వాతావరణంతో పెట్టుబడిదారులు భారీగా స్టాక్స్ కొనుగోళ్లు చేశారు. దీంతో స్టాక్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 532 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 72633 వద్ద ప్రారంభం అయింది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 21999 వద్ద ట్రేడవుతోంది. రూపాయి స్వల్పంగా బలహీనపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.06 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఇండెక్స్ 30లో మారుతీ, నెస్లే ఇండియా షేర్లు మాత్రమే నష్టాలను చవిచూశాయి. టాటా స్టీల్, ఇండస్ ఇండ్, విప్రో, ఎన్టిపిసీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహింద్రా, కోటక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫెడ్ బ్యాంకు వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం స్టాక్ మార్కెట్లకు కలసి వచ్చింది.