అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వాదనలను అమెరికా ఖండించింది. అరుణాచల్‌ప్రదేశ్ భారత భూభాగమేనని స్పష్టం చేసింది. చైనా చేష్టలను తప్పుపట్టింది. అది ఎప్పటికీ భారత భూభాగమని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. సరిహద్దులను మార్చాలనే చైనా ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటి అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు. వాస్తవాధీన రేఖపై చైనా చేస్తున్న వాదనలను తిప్పికొడుతున్నట్లు ఆయన చెప్పారు.
అరుణాచల్‌ప్రదేశ్ తమదంటూ చైనా కొన్ని దశాబ్దాలుగా మొండి వాదన చేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగమంటూ చైనాకు చెందిన సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ ఇటీవల చేసిన వాదనలను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌ను తమ భూభాగం నుంచి ఎవరూ విడదీయలేరని భారత్ స్పష్టం చేసింది. నిరాధార వాదనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని హితవు పలికింది.డ్రాగన్ కుట్రలను అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అభిప్రాయపడ్డారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు