Two children brutally killed in Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఇద్దరు చిన్నపిల్లలను
పొరుగింట్లో ఉంటున్న ఇద్దరు ముస్లిం వ్యక్తులు దారుణంగా చంపేసిన సంఘటన సంచలనం సృష్టించింది.
ఆ కేసులో పోలీసులు ఒకవ్యక్తిని ఎన్కౌంటర్ చేసారు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆ
సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవాళ వెలుగుచూసాయి. మరోవైపు, స్థానికులు ఆ నేరస్తులకు
వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
పోలీసులు ఈ ఉదయం చెప్పిన వివరాల ప్రకారం… బదౌన్‌లోని
బాబా కాలనీలో సాజిద్ అనే వ్యక్తి క్షౌరశాల నడుపుతున్నాడు. అతని సెలూన్‌కు ఎదురుగా
వినోద్ అనే వ్యక్తి కుటుంబం ఒక దుకాణం నిర్వహిస్తోంది. వినోద్, సంగీత దంపతులకు
ముగ్గురు పిల్లలు. ఆయుష్ వయసు 11ఏళ్ళు, పీయూష్ వయసు 7ఏళ్ళు, అహాన్ వయసు 6ఏళ్ళు.
మంగళవారం సాయంత్రం సాజిద్, వినోద్ దుకాణానికి వెళ్ళాడు.
ఏవో వస్తువులు కొనుక్కున్నాడు. ఆ సమయంలో వినోద్ లేడు. సాజిద్, గర్భవతి అయిన తన
భార్య ఆస్పత్రిలో ఉందని, ఆ రాత్రే 11 గంటలకు డెలివరీ చేస్తారనీ చెప్పాడు. ఆస్పత్రి
ఖర్చుల కోసం 5వేల రూపాయలు అత్యవసరంగా కావాలని చెప్పుకొచ్చాడు. సంగీత అతనికి కొన్ని
ఓదార్పు మాటలు చెప్పింది. వినోద్‌కు ఫోన్ చేస్తే, అతను డబ్బులు ఇవ్వమని చెప్పాడు.
దాంతో సంగీత సాజిద్‌కు 5వేల రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత టీ తెస్తానంటూ వంటగదిలోకి
వెళ్ళింది.
అంతలో సాజిద్, వినోద్ ఇంటి మేడ మీదకు వెళ్ళాడు.
అక్కడ ముగ్గురు పిల్లలూ ఉన్నారు. వారిపై కత్తితో దాడి చేసాడు. ఆయుష్, అహాన్ గొంతులు
కోసేసాడు. పీయూష్ మీద కూడా దాడి చేసాడు, కానీ ఆ పిల్లవాడు పారిపోయి
తప్పించుకున్నాడు. అతనికి కొద్దిపాటి గాయాలయ్యాయి.
సాజిద్ వెంటనే బైటకు వచ్చి అక్కడ మోటార్‌సైకిల్
మీద ఎదురు చూస్తున్న తన సోదరుడు జావేద్‌తో కలిసి పరారయ్యాడు.
విషయం తెలిసిన పోలీసులు నిందితులను పట్టుకునే
ప్రయత్నం చేసారు. ఆ క్రమంలో సాజిద్ పోలీసులపైనా కాల్పులు జరిపాడు. ఆ దాడిలో ఒక
ఇనస్పెక్టర్‌కు బులెట్ గాయాలయ్యాయి. పోలీసుల ప్రతికాల్పుల్లో సాజిద్ చనిపోయాడు. జావేద్
పరారైపోయాడు. అతనికోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఈ సంఘటన బదౌన్లొ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
స్థానికులు సాజిద్ క్షౌరశాలకు నిప్పుపెట్టారు.
సాజిద్ చిన్నపిల్లలను హత్య చేయడానికి కారణాలు
తెలియరాలేదు. అసలు వినోద్ కుటుంబంతో అతనికి ఎలాంటి గొడవలూ లేవు. ఆ విషయాన్ని
వినోద్ ధ్రువీకరించాడు.
బదౌన్ పోలీసులు సాజిద్ తండ్రిని, బాబాయినీ అదుపులోకి
తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బదౌన్‌లో పరిస్థితిని పోలీసులు అదుపు చేసారు.
గతరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు ఈ ఉదయం
నగరంలో ఫ్లాగ్‌మార్చ్ చేపట్టారు. సాజిద్, జావేద్‌ల పేరిట ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు
కొనసాగిస్తున్నారు.
సాజిద్ తల్లి నాజిన్, తన
కొడుకుకు తగిన గతే పట్టిందని వ్యాఖ్యానించింది. అసలు సాజిద్, జావేద్ ఎందుకు అలాంటి
ఘాతుకానికి ఒడిగట్టారో తెలియడం లేదని వాపోయింది. బాధిత కుటుంబం పట్ల సానుభూతి
ప్రకటిస్తూ, తన కొడుకు చేసిన నేరానికి పోలీసుల చేతిలో తగిన గతే పట్టిందంటూ ఆ తల్లి
ఆవేదన వ్యక్తం చేసింది.