AIADMK releases its first list of candidates for LS Poll
రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ
చేసే అభ్యర్ధుల మొదటి జాబితాను అన్నాడీఏంకే ఇవాళ విడుదల చేసింది. మొత్తం 16మంది
అభ్యర్ధుల పేర్లతో ఆ జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి
ప్రకటించారు.
తమ అభ్యర్ధుల ప్రకటన సందర్భంగా పళనిస్వామి,
భాగస్వామ్య పక్షాలకు ఇస్తున్న సీట్ల సంఖ్యను కూడా ప్రకటించారు. ఈ కూటమిలో
డీఎండీకేకు 5స్థానాలు, పుదియ తమిళగం, ఎస్డిపిఐ పార్టీలకు చెరొక స్థానం
ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల కోసం పార్టీ జాబితాను ప్రకటిస్తూ పొత్తుల
గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి మాట్లాడారు.
‘‘మేం బలంగా ఉన్నాం. ప్రజలు మాకు మద్దతిస్తారు.
సోషల్ మీడియాలో ప్రజలు ఏమనుకుంటున్నారో మాకు అనవసరం. మేం ప్రజలతోనే పొత్తులో
ఉన్నాము’’ అని చెప్పారు.
పీఎంకే తమ కూటమిలో చేరకపోవడం బాధాకరమేనని
పళనిస్వామి అన్నారు. అంతమాత్రాన తామేమీ నిరాశ చెందడం లేదన్నారు. అన్నాడీఎంకే
ఎప్పుడూ తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. మా కూటమిలోకి ఎవరైనా రాదలచుకుంటే రావచ్చు.
అది పూర్తిగా ఆ పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మేమం ఎవరినీ బలవంతపెట్టం’’
అని చెప్పారాయన.
ఈ లోక్సభ ఎన్నికలకు అన్నాడీఎంకేకు తోడుగా ఎస్డీపీఐ,
తమిళ మానిల ముస్లింలీగ్, ఎంఎన్జేకే, పుదియ తమిళగం పార్టీలు ఉన్నాయి.
తమిళనాడులో రాష్ట్రంలోని మొత్తం 39 లోక్సభ
నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఒకే దశలో ఏప్రిల్ 19న జరగనుంది.