ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ (IMD Weather Report) హెచ్చరించింది. బుధవారం, గురువారంనాడు ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశ ముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదముందని, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గడచిన 24 గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.