కాకినాడ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమీపంలోని లక్ష్మీపురం గ్రామ పంట పొలాల్లో ఒకేసారి ఇద్దరు హత్యకు (crime news) గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం. చేబ్రోలుకు చెందిన పి.శ్రీను, పెండ్యాల లోవమ్మలను అదే పంచాయతీకి చెందిన నాగబాబు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు.లోవమ్మ తల్లిపై కూడా కత్తితో నాగబాబు దాడికి దిగాడు. ఆమెను సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
తనతో సహజీవనం మాని, పోసిన శ్రీనుతో మొదలు పెట్టడంతో నాగబాబు కక్షకట్టాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. హత్యలు జరిగిన ప్రాంతాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు.భర్తతో విభేదాలు రావడంతో లోవమ్మ పోసిన శీనుతో సహజీవనం సాగిస్తోంది.లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. శీనుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. నాగబాబుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు