ఎన్నికల
ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్నిఆదేశించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన
ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాతో కలిసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై
సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ
వెబ్ సైట్లన్నిటిలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలు, ఆడియో, వీడియోలు తొలగించాలని స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి
గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు.
.ప్రభుత్వ
ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి
ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యల తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర
ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో
ఉన్నందున కొత్త పథకాలు ప్రకటించడానికి వీలులేదని స్పష్టం చేశారు. ఫించన్లు
పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం
కింద వివిధ లబ్ధిదారులకు ఉపాధి పనులు
కల్పించవచ్చని చెప్పారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు ఏవైనా
పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆ ప్రక్రియను కొనసాగించవచ్చు అని
వివరించారు.
ఈ సమావేశంలో
ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, వై.శ్రీలక్ష్మి, కె.విజయానంద్, వర్చువల్ గా యం.టి కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య
కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, హరీశ్
కుమార్ గుప్తా ,ప్రవీణ్ ప్రకాశ్, సునీత, కాంతిలాల్ దండే, చిరంజీవి
చౌదరి, వాణీ మోహన్, పలువురు కార్యదర్శులు, కమీషనర్లు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోన్ని
వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టరులు, బ్యానర్లను అనుమతించ వద్దని రాష్ట్ర
ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను
ఆదేశించారు. ప్రస్తుతం హైవేలు, మెయిన్ రోడ్ల ప్రక్కనున్న హార్డింగ్లను కూడా సమాన
ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలన్నారు.
జిల్లా ఎన్నికల అధికారులతో
రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
బోర్డర్
చెక్ పోస్టు ల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ
ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్
సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సి
విజిల్ ద్వారా అందే ఫిర్యాదుల సకాలంలో
పరిష్కరించడం పై సమీక్ష నిర్వహించారు.
ఈ
సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు
అదనపు సీఈవో లు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్,
డిప్యూటీ
సీఈవో కె. విశ్వేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.