వైసీపీ
అధినేత, సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు బస్సు యాత్ర చేపడతారని ఆ పార్టీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ బస్సు
యాత్రకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ప్రతీ పార్లమెంట్, ప్రతీ
జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో పర్యటించనున్న
వైఎస్ జగన్ తొలి సభను మార్చి 27
ప్రొద్దుటూరులో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగింస్తారు.
సిద్ధం సభలకు ధీటుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మేమంతా సిద్ధం సభలు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పాదయాత్రలో
ప్రజలతో మమేకమైనట్లే బస్సు యాత్రలో కూడా స్థానికులతో మాట్లాడి సలహాలు, సూచనలు
స్వీకరిస్తారని చెప్పారు.
ఇడుపులపాయ
నుంచి మార్చి 27 న బస్సు యాత్ర చేపట్టనున్న సీఎం జగన్, అదే రోజు ప్రొద్దుటూరులో
జరిగే సభలో పాల్గొంటారు. సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో
యాత్ర కొనసాగేలా షెడ్యలూ ఖరారు చేసినట్లు చెప్పారు.
బస్సు యాత్రలో భాగంగా ప్రతీరోజు ఉదయం వివిధ వర్గాలతో సీఎం జగన్ ఇంటరాక్షన్
కార్యక్రమం ఉంటుందని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు
స్వీకరిస్తారని చెప్పారు. మధ్యాహ్నం
తర్వాత పార్టీ నేతలను కలుస్తారన్నారు.
తొలిరోజు
ప్రొద్దుటూరులో, రెండో రోజు నంద్యాలలో మూడో రోజు ఎమ్మిగనూరులో
సభలు నిర్వహించేలా ప్రస్తుతం షెడ్యూల్ ఖరారైందన్నారు.
ఈ
కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
పాల్గొన్నారు.