కర్నూలు
జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్, వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్ధర్ కు కాంగ్రెస్
కండువా కప్పిన షర్మిల పార్టీలోకి స్వాగతించారు.
నందికొట్కూరు
నుంచి ఫ్యాన్ గుర్తుపై దారా సుధీర్ పోటీ
చేస్తారని వైసీపీ ప్రకటించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్ మనస్తాపం
చెందారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఆర్థర్ మధ్య విభేదాలు ఉన్నాయి.ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. దీంతో సిద్ధార్థ వైపు అధిష్టానం
మొగ్గింది.
నందికొట్కూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకంలో బైరెడ్డి సిద్ధార్థ్
రెడ్డి పైచేయి సాధించారు. బైరెడ్డి
సూచించిన వ్యక్తికే చైర్మన్ పదవి లభించింది.
టికెట్
దక్కకపోవడంతో పాటు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆయన నిరాశ చెందినట్లు స్థానికంగా
చర్చ జరుగుతుంది.