స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు
నాయుడుకు స్వల్ప ఊరట దొరికింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు
చేయాలంటూ సుప్రీంకోర్టును ఏసీబీ ఆశ్రయించింది. అయితే ఈ కేసు విచారణ పలుమార్లు
సుప్రీంలో వాయిదా పడింది.
నేడు ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్
మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం, హోలీ తర్వాత కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్
16కి తదుపరి ఈ పిటిషన్
విచారణ ధర్మాసనం ముందుకు రానుంది. దీంతో
చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది.
అధికారులతో పాటు దర్యాప్తు సంస్థను
చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తన పిటిషన్ లో ప్రస్తావించింది.
రెడ్ డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నామంటూ బెదిరించారని కోర్టుకు తెలిపింది.
ఈ పరిణామం చంద్రబాబుకు ఊరటగానే చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల
ప్రచారాన్ని నిర్వహించుకునే అవకాశం దక్కింది.