Jharkhand
governor given additional charge of Telangana
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై
సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తమిళిసై పుదుచ్చేరి
లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో క్రియాశీల రాజకీయాల్లో
పాల్గొనేందుకు ఆమె తన పదవికి రాజీనామా చేసారు.
ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సీపీ
రాధాకృష్ణన్‌కు తమిళిసై స్థానంలో తెలంగాణ గవర్నరర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆయనే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తారు.
తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్‌ను
నియమించేవరకూ ఝార్ఖండ్ గవర్నర్ ఈ అదనపు బాధ్యతలు వహిస్తారని రాష్ట్రపతి భవన్
కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.