కోస్తాంధ్రలో రేపు భారీ వర్షం
కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. రేపు(మార్చి 20) కోస్తాంధ్ర జిల్లాల పరిధిలో 6 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం
నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
జార్ఖండ్
నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ ఓ
ప్రకటనలో తెలిపింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ అంబేద్కర్ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో
ఉరుములు, పిడుగులతో
కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ నిపుణులు అంచనా వేశారు.
ఏలూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ వర్షాలు
కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
కురుస్తాయని తెలిపింది. ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని సూచించింది.