Supreme Court to
hear 237 petitions against CAA today
పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను అమల్లోకి
తెస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఏకంగా 237
పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటి విచారణనూ సుప్రీంకోర్టు ఇవాళ చేపట్టనుంది. సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్
మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుంది.స
పిటిషన్లు దాఖలు చేసినవారిలో కేరళకు
చెందిన రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్
ఇండియా డీవైఎఫ్ఐ, కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు
మహువా మొయిత్రా, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఉన్నారు.
కేంద్రం సీఏఏ నియమనిబంధనలను నోటిఫై
చేసిన మరునాడు, ఆ చట్టం అమలును ఆపాలంటూ ఐయూఎంఎల్, డీవైఎఫ్ఐ సుప్రీంకోర్టును
ఆశ్రయించాయి. ఆ చట్టం ముస్లిముల పట్ల వివక్ష చూపుతోందన్నాయి.
పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రప్రభుత్వం
2019లో చట్టం చేసి ఆమోదించింది. దాని అమలును ఆపాలంటూ సుప్రీంకోర్టులో పలు
పిటిషన్లు ధాఖలయ్యాయి. కానీ అప్పటికి ఆ చట్టానికి సంబంధించిన నియమనిబంధనలు నోటిఫై
చేయలేదు. ఆ కారణంతో చట్టం అమలును సుప్రీంకోర్టు నిలువరించలేదు. ఇప్పుడు ఎన్నికలకు
ముందు రాజకీయ లబ్ధి కోసమే నియమ నిబంధనలను నోటిఫై చేసారని సీనియర్ న్యాయవాది కపిల్
సిబల్ వాదించారు. ఆ వాదనను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు. ఎన్నికల
సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది అప్రస్తుతమైన అంశం అన్నారు.