Supreme Court to hear petition of BRS leader Kavita today
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ అధికారులు తనకు జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. కవిత ఆ
పిటిషన్ను గతేడాది మార్చి 15న దాఖలు చేసారు. అదే సమయంలో, ఈ నెల 15న తనను ఈడీ
అరెస్ట్ చేయడం పైన కూడా కవిత నిన్న పిటిషన్ దాఖలు చేసారు. అలాగే కవితకు సమన్ల
జారీని వాయిదా వేస్తూ సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆమెను అరెస్ట్
చేసారంటూ ఆమె న్యాయవాది నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ కూడా ఇవాళ
విచారణకు రానుంది.
మరోవైపు…. ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తులో
పురోగతి సాధించామని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు పేర్కొన్నాయి. 2021-22 సంవత్సరానికి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నందున
కొంతమంది ఉన్నతస్థాయి వ్యక్తులను అరెస్టు చేయవచ్చని సీబీఐ కోర్టుకు తెలిపింది.ఆ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలతో కలిసి బీఆర్ఎస్ నాయకురాలు కవిత కుట్ర పన్నారని ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కవిత రూ.100 కోట్లు లంచం ఇచ్చారని ఆరోపించింది.కవితను ఈ నెల 15న హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు
చేశారు.
ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం 2021-22 రూపకల్పన, అమలులో
అవినీతి, కుట్రల
ద్వారా ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమ నిధులు సమకూరాయని ఈడీ ఆరోపించింది.