ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్ విచారణ
సందర్భంగా సుప్రీంకోర్టు మరోసారి స్టేట్‌బ్యాంక్ ఆఫ్
ఇండియా(SBI)పై ఆగ్రహం వ్యక్తం చేసిది.
ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంత మొత్తం
నిధులు అందజేసిందో ఆల్ఫాన్యూమరిక్ సీరియల్ కోడ్‌తో సహా వివరాలను మార్చి 21 లోపు వెల్లడించాలని ఆదేశించింది.
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన
వారందరి మొత్తం వివరాలను బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది. అలాగే బాండ్ల విషయంలో గురువారం
సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ
ఛైర్మన్ దినేష్ ఖేరాను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్‌గా
ఉండకూడదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, దీనికి సంబంధించిన ప్రతీ సమాచారం బహిర్గతం
కావాల్సిందేనని తెలిపింది.
ఎస్బీఐ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఎలక్టోరల్
బాండ్ల సీరియల్ కోడ్‌ను సైతం ఎస్బీఐ అందజేస్తుందని తెలిపారు. ఎలాంటి డేటాను ఎస్బీఐ తన వద్ద ఉంచుకోదు అని కోర్టుకు సాల్వే
చెప్పారు.