ఆంధ్రప్రదేశ్
లోని ఆరు జిల్లాల పరిధిలో 87 కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈశాన్య
రుతుపవనాల సమయంలో లోటు వర్షపాతం, తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత, భూగర్బ జలాలు
పడిపోవడం సహా ఇతర పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది.
గత
ఏడాది నవంబర్ లో 103 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా తాజాగా మరో 87 మండలాలు
ఈ జాబితాలో చేరాయి. ఇందులో ఎక్కుమ మండలాలు రాయలసీమ ప్రాంతంలోనివే.
రెవెన్యూ
శాఖ(విపత్తుల నిర్వహణ) ముఖ్య ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ ప్రకటన జారీ చేశారు.
63 మండలాల పరిధిలో తీవ్రమైన కరువు పరిస్థితులుండగా, 24 మండలాల్లో మోస్తరుస్థాయిలో
ప్రభావం ఉంది.
ప్రకాశం
జిల్లా పరిధిలోని 31 మండలాలతో పాటు కర్నూలు జిల్లాలో 18, అనంతపురంలో 14, నంద్యాలలో
13, నెల్లూరు జిల్లాలో పది, శ్రీ సత్యసాయి జిల్లాలోని ఒక మండలంలో కరువు
తాండవిస్తోంది.
కరువు
మండలాల్లోని రైతులకు రుణం సదుపాయం కల్పించడంతో పాటు ఇతర ఉపశమన చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్లను అజయ్ జైన్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ రోజులు పని
కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.