Afghan Sikhs who migrated to India laud and welcome CAA
శ్రీ ఆర్జన్‌దేవ్ జీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు,
అప్ఘానిస్తాన్ నుంచి భారత్ వచ్చిన సిక్కు వ్యక్తి అయిన ఎస్ ఎస్ ప్రతాప్ సింగ్,
కేంద్రప్రభుత్వం సీఏఏ నియమ నిబంధనలను నోటిఫై చేయడాన్ని స్వాగతించారు.
అప్ఘానిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన సిక్కులు భారతదేశంలో 1991 నుంచీ
ఉంటున్నారనీ, కానీ వారికి ఈనాటివరకూ పాస్‌పోర్ట్ లేదా ఆధార్ కార్డ్ లేవని
చెప్పారు. ఇప్పుడు సీఏఏ అమలుతో అలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు.
‘‘1990లలో అక్కడ అప్ఘానిస్తాన్‌లో ప్రభుత్వం
మారింది. అప్పుడే మేం భారతదేశానికి వలస రావడం మొదలైంది. దేశ విభజనకు ముందునుంచే
మేం భారత్‌లో ఉన్నాం. కానీ మమ్మల్ని అప్ఘానీ సిక్కులు అనే అనేవారు. 1991 నుంచీ
ఇక్కడ ఉన్నవాళ్ళు, లేదా ఈ దేశంలో పుట్టినవాళ్ళు… ఎవరికీ ఇప్పటివరకూ పాస్‌పోర్ట్
కానీ ఆధార్ కార్డు కానీ లేవు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు సీఏఏ వల్ల తీరతాయి’’ అని
ఆశాభావం వ్యక్తం చేసారు.
సీఏఏ గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్
కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ప్రతాప్ కుమార్ ‘‘మేం భారత్‌లోకి
చట్టబద్ధంగా వచ్చాము, మేం ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదు. మేము మా పని
చేసుకుంటున్నాం’’ అని చెప్పారు. అంతకుముందు పాకిస్తాన్ అప్ఘానిస్తాన్ల నుంచి
భారత్ వచ్చిన శరణార్థులు కేజ్రీవాల్, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
బీజేపీని విమర్శించాలనే దుగ్ధతో
అరవింద్ కేజ్రీవాల్ శరణార్థులను నిందించారు. ‘‘ఈ పాకిస్తానీలకు ఎంత ధైర్యం? మొదట వారు
అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డారు, మన చట్టాలను ఉల్లంఘించారు. వారిని జైల్లో
పెట్టాల్సింది. వాళ్ళకి ఎంత ధైర్యం లేకపోతే మనదేశంలోనే ఆందోళనలు చేపట్టి గొడవ
చేస్తారా? సీఏఏ తర్వాత పాకిస్తానీలు, బంగ్లాదేశీలు దేశమంతా వ్యాపిస్తారు, ఇక్కడి
జనాలను వేధిస్తారు. వారిని తమ ఓటుబ్యాంకుగా మార్చుకోవాలన్న స్వార్థంతో బీజేపీ దేశం
మొత్తాన్నీ సమస్యల్లోకి నెట్టేస్తోంది’’ అంటూ కేజ్రీవాల్ ఎక్స్‌లో ట్వీట్ చేసారు.