సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను
మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హోం కార్యదర్శులను మారుస్తున్నట్లు
హోంశాఖ తెలిపింది.
మిజోరం జీఏడి కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ సీఎంఓ కార్యదర్శులను ఎన్నికల
సంఘం తొలగించింది. పశ్చిమ బెంగాల్ డీజీపీని కూడా ఎన్నికల సంఘం మార్చింది. ముంబై
మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల తొలగించినట్లు ఈసీ
వెల్లడించింది.