దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కు
పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి సత్యేంద్ర జెయిన్ బెయిల్ వినతిని సుప్రీంకోర్టు
తిరస్కరించింది.
జైన్ వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు
ధర్మాసనం ఆదేశించింది. ‘బెయిల్ పిటిషన్
డిస్మిస్ చేస్తున్నాం, పిటిషనర్ వెంటనే లొంగిపోవాలి’ అని వ్యాఖ్యానించింది.
అనారోగ్య కారణాల కారణంగా లొంగిపోయేందుకు సమయం ఇవ్వాలని కోరినప్పటికీ న్యాయస్థానం
ఒప్పుకోలేదు.
గత ఏడాది మే 26న సత్యేంద్రజైన్ మధ్యంతర మెడికల్
బెయిల్ పొందారు. గతేడాది జులై 21న వెన్నెముక ఆపరేషన్ చేయించుకున్నారు.
దిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో 2015 నుంచి 2017మంత్రిగా
ఉన్న సమయంలో సత్యేంద్ర జైన్ పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమ ఆస్తులు పోగేశారనే
అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులోనే సత్యేంద్ర జైలు పాలయ్యారు.