బీజేపీ శక్తిని నాశనం చేస్తామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. శక్తిని ఆరాధించే వారికి, నిర్వీర్యం చేసే వారికి మధ్య పోరాటం సాగుతోందన్నారు. శక్తిని నాశనం చేస్తానంటూ రాహుల్ గాంధీ విసిరిన సవాల్ స్వీకరిస్తున్నట్లు మోదీ తెలంగాణలోని జగిత్యాల సభలో స్పష్టం చేశారు. ప్రతి చెల్లి, తల్లి, కుమార్తె శక్తి స్వరూపమేన్నారు.
తెలంగాణలోని జగిత్యాలలో నిర్వహించిన సంకల్ప సభలో రాహుల్ శక్తి వ్యాఖ్యలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. విపక్షాల ఇండీ కూటమి కొద్ది రోజుల కిందట ముంబైలో ర్యాలీ నిర్వహించింది. శక్తికి వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. ప్రతి మహిళ శక్తి స్వరూపం. అలాంటి శక్తిని నాశనం చేస్తామని ఇండీ కూటమి మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై ప్రధాని మోదీ మండిపడ్డారు.
చంద్రయాన్ 3 మిషన్ ద్వారా జాబిల్లిపై రోవర్ దిగిన ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టుకున్నామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. శక్తి అంటే అధికారానికి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. శక్తి అంటే మోదీ అని అర్థమని విపక్షాలు చెప్పుకొచ్చాయి. మోదీ శక్తి ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ, డబ్బు, ఈవీఎంలలో ఉందని విపక్షాలు మండిపడ్డాయి. విపక్షాల విమర్శలు తీవ్ర దుమారానికి దారితీశాయి.