విభిన్న
సంస్కృతులతో పాటు రకరకాల నోరూరించే వంటకాలకు భారతదేశం ప్రత్యేకమనే విషయం మరోసారి
రుజువైంది. భారతదేశీయ తీపిపదార్ధమైన రసమలైకి ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్
అట్లాస్ ప్రకటించిన ప్రపంచ టాప్-10 చీజ్ డిజర్ట్స్ జాబితాలో రెండో స్థానం
దక్కింది.
బెంగాలీ
వంటకమైన రసమలైని భోజనం సందర్భంగా ఆరగించడంతో పాటు శుభకార్యాలప్పుడు, ప్రత్యేకమైన
రోజుల్లో వీటిని విందుల్లో వడ్డిస్తారు.
పశ్చిమబెంగాల్
లో ఈ రుచికరమైన వంటకాన్ని ఎక్కువగా రుచిచూస్తారు. పంచదార, కుంకుమపువ్వు,
నిమ్మరసంతో ఈ ప్రత్యేకమైన స్వీట్ తయారు చేస్తారు.
ప్రపంచంలోని
మొదటి పది స్వీట్లలో పోలెండ్ కు చెందిన సెర్నిక్ తొలి స్థానంలో నిలిచింది. ఇది కూడా
చీజ్ డిజర్ట్ అయినప్పటికీ కోడిగుడ్లను తయారీ లో ఉపయోగిస్తారు.
సెర్నిక్, రసమలై తర్వాత స్థానంలో గ్రీస్ కు చెందిన
వంటకం ‘స్ఫకియానోపిటా’ నిలవగా,
న్యూయార్క్ చీజ్ (అమెరికా),
జపనీస్ చీజ్ (జపాన్),
బాస్క్ చీజ్ (స్పెయిన్),
రాకోజీ టురోస్ (హంగేరీ),
మెలోపిటా (గ్రీస్),
కసెకుచెన్ (జర్మనీ),
మిసారెజీ (చెక్ రిపబ్లిక్) టాప్ 10లో చోటు దక్కింది.