తెలంగాణ గవర్నర్ తమిళి సై తన పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాడులో తమిళిసై సేవలు ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో తమిళనాడు బీజేపీలో తమిళిసై కీలకంగా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇలాంటి సమయంలో తమిళిసైను తమిళనాడు నుంచి బరిలోకి దింపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె అనుభవాన్ని వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని పార్టీ యోచిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి లేదా దక్షిణ చెన్నయ్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తమిళిసై బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది.