ప్రభుత్వ పథకాలు, విద్యాసంస్థల్లో
చేరిక, ప్రభుత్వ నియామకాలకు
బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి అని కేంద్రప్రభుత్వం
పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలంటూ
రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది.
ఏపీలో 14,752 జనన, మరణ నమోదు యూనిట్లు ఉన్నాయి. ఆసుపత్రులు, మున్సిపల్
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు,
నగర పంచాయతీలు, పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేశారు.
కొత్త చట్టం మేరకు జనన, మరణ రిజిస్ట్రేషన్
ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తిచేసి ధ్రువపత్రం జారీ చేయాల్సి ఉంది.
కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్రాల చీఫ్
రిజిస్ట్రార్లు, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో జనన,
మరణాల డేటాను నిర్వహిస్తారు.
జనాభా రిజిస్టర్, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ నంబర్లు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తుల
రిజిస్ట్రేషన్ డేటా బేస్‌లు కూడా ఉంటాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే జననాలకు
సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు అందజేయాలి.