ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనను అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ, ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుపై సుప్రీంకోర్టులో
ఓ వైపు విచారణ జరుగుతుండగానే తనను అరెస్ట్ చేసినట్లు కవిత పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో తనను విచారించినప్పుడు ఇక సమన్లు జారీ చేయమని చెప్పిన అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు కవిత తరపు న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు.
ఈడీ అధికారులు కోర్టు దిక్కరణకు పాల్పడ్డారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్లో కోరారు. కవిత తరపు సీనియర్ న్యాయవాది ఒకరు ఆన్లైన్లో సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఇవాళ విచారణ ఉంటుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.