ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి అడుగు దూరంలో ఉందని పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. గెలుపు ప్రకటన రాగానే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీశాయి.నాటో కూటమికి, రష్యాకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నవేళ పుతిన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఈ ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి అడుగుదూరంలో ఉందని, అయితే ఎవరూ అలా జరగాలని కోరుకోవడం లేదని పుతిన్ పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు.
1962 తరవాత పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తరచూ అణ్వస్త్రాల గురించి పుతిన్ హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్లో అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం తమకు రాలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఉక్రెయిన్లో రాబోయే రోజుల్లో తమ సైన్యాన్ని మోహరించాల్సి రావచ్చంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ వ్యాఖ్యానించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడానికి దారితీశాయి. ఉక్రెయిన్లో నాటో దళాలు పనిచేస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందేనని పుతిన్ చెప్పారు. మూడో ప్రపంచ యుద్దానికి అడుగుదూరంలో మాత్రమే ఉన్నామని, అలా జరగరాదని అందరూ కోరుకుంటున్నారని పుతిన్ గుర్తు చేశారు.
రష్యాలో ప్రతిపక్షనాయకుడు నావల్నీ మరణంపై కూడా పుతిన్ నోరు విప్పారు. నావల్నీని జైలు నుంచి విడిపించాలనుకున్నాం. అంతలోనే నావల్నీ చనిపోయాడని పుతిన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి, విదేశాల్లోని జైళ్లలో ఉన్న రష్యన్లను కొంత మందిని విడిపించాలనుకున్నట్లు పుతిన్ తెలిపారు.అయితే నావల్నీ తిరిగి రష్యాకు రావద్దనే షరతును విధించానని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని పుతిన్ అభిప్రాయపడ్డారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు