కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పదిమందిని పోలీసులు కాపాడారు. భవనాల శిథిలాల కింద ఎంత మంది చిక్కుకుపోయారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
నిర్మాణంలో ఉన్న భవనం కావడంతో అందులో ఎవరూ లేరు. పెను ప్రమాదం తప్పింది. అయితే పక్కనే ఉన్న గుడిసెలపై భవనాల శిథిలాలుపడ్డాయి. వాటిల్లో కొందరు చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పది మందికి రక్షించారు. మరికొంత మంది శిథిలాల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.ఈ ఘటనలో పలువురు చనిపోయి ఉండవచ్చని బీజేపీ నేత సువేందు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది.