ఎన్నికల్లో
గెలుపు ఎన్డీయే కూటమిదేనని, ఇందులో ఎవరికీ సందేహం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు
చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా బొప్పూడిలో
ఎన్డేయే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం
బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు. ‘‘ఐదు కోట్ల తెలుగు ప్రజల తరఫున ప్రగతివాది
ప్రధాని మోదీకి స్వాగతం’’ అన్నారు. బొప్పూడి సభ ను రాష్ట్ర పునర్ నిర్మాణ సభగా
అభివర్ణించిన చంద్రబాబు, ఈ సభ ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని
సాకారం చేస్తుందన్నారు.
ఐదేళ్ల
వైసీపీ పాలనలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం
అయ్యాయన్న చంద్రబాబు, ప్రజల గుండె చప్పుడు
బలంగా వినిపించేందుకే మూడు పార్టీలు జట్టు
కట్టాయన్నారు. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను
నిర్ణయిస్తుందన్నారు. కూటమిలోని పార్టీల జెండాలు వేరు అయినప్పటికీ అజెండా ఒక్కటేన్నారు.
సభ
వేదికగా పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు, ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ఓ వ్యక్తి కాదు శక్తి అన్నారు. భారతదేశాన్ని
విశ్వగురుగా మారుస్తున్నారన కొనియాడారు.‘‘ మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం.. ప్రపంచ మెచ్చిన మేటి
నాయకుడు’’ అని కొనియాడారు.
మూడు
ముక్కలాటతో రాష్ట్రాన్ని వైసీపీ భ్రష్టు
పట్టించిందని విమర్శించిన చంద్రబాబు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా
అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారని దయ్యబట్టారు. దేశంలో ఎన్డీయేకి
400 పైచిలుకు సీట్లు వస్తాయన్నారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీదే అని
ప్రజలను కోరారు.