ఆంధ్రప్రదేశ్
లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని గా
బాధ్యతలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరి పేట మండల పరిధిలోని బొప్పూడి లో నిర్వహించిన ఎన్డీయే
కూటమి సభ ప్రజాగళంలో పాల్గొని ప్రసంగించిన పవన్, గతంలో తిరుపతి శ్రీ
వేంకటేశ్వరస్వామి సాక్షిగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరితే, ఈ సారి
బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో ఎన్డీయే పునర్కలయిక జరిగిందన్నారు.
తాడేపల్లి గూడెం
సభ లో తాను దేవదత్తం పూరిస్తే పల్నాడు సభలో ప్రధాని పాంచజన్యం పూరించారని పవన్
అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన పవన్, ఎన్డీయే
కూటమిదే విజయం అన్నారు. కూటమిదే
అధికారపీఠమని పునరుద్ఘాటించారు.
చిలకలూరిపేట
సభలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి
ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున స్వాగతం పలికుతున్నామని వ్యాఖ్యానించారు.
ప్రధాని
నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశమంతా డిజిటల్ ట్రాన్స్ సెక్షన్లు జరుగుతుంటే
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు
జరుగుతున్నాయన్నారు. బ్లాక్ మనీ ఎటు పోతుందని పవన్ ప్రశ్నించారు.
వైసీపీలో పాలనలో ఆంధ్రప్రదేశ్ గంజాయికి
రాజధానిగా మారిందన్నారు. 2019-21 మధ్య రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైన విషయాన్ని సభలో
పవన్ ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు దాడులు
చేశారన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా
విదేశీ సంస్థలు మనదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కంపెనీలు తరలిపోయాయన్నారు.
వైసీపీ పాలనతో విసుగు చెందిన పారిశ్రామిక
వేత్తలు పొరుగు రాష్ట్రానికి తరలిపోయారన్నారు.