సార్వత్రిక
ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు శనివారం షెడ్యూల్ విడుదల
చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన
కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ
చేసింది.
అరుణాచల్
ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
కౌంటింగ్‌ను సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కంటే రెండు రోజుల ముందే జూన్ 2న
చేపట్టనున్న ప్రకటనలో తెలిపింది.
అరుణాచల్
ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2తో
ముగియనుంది. ఏప్రిల్ 19న మొదటి విడతలో భాగంగా ఈ రాష్ట్రాల్లో
పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో 60
అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా, సిక్కింలో
32 స్థానాలకు పోలింగ్ జరగనుంది.