ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా అందిన నిధులకు సంబంధించిన తాజా వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది.
ఎస్బీఐ సుప్రీంకోర్టుకు అందించిన సమాచారాన్ని, రిజిస్ట్రీ సీల్డ్‌కవర్, పెన్ డ్రైవ్‌లో, ఫ్రింట్ కాపీలను అందించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిజిటలైజ్ రూపంలో అందిన సమాచారాన్ని సీఈసీ అప్‌లోడ్ చేసింది.
సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి అందిన డేటాను కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఒక రోజు తరవాత ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై జూన్ 1న ముగియనున్నాయి.