అఫ్గానిస్తాన్
లో ఘోరం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 38 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్నారు.
హెల్మాండ్
ప్రావిన్స్‌లోని గెరాష్క్ జిల్లా పరిధిలో జాతీయ
రహదారిపై
నేటి ఉదయం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
కాందహార్
నుంచి హెరత్ ప్రావిన్స్‌కు ప్రయాణిస్తున్న బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈక్రమంలో
అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. గాయపడిన వారిలో
11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో
వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టినట్లు గెరాష్క్ జిల్లా అధికారులు తెలిపారు.