జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పర్యాటక
ప్రదేశాల్లో అవలాంచ్లు ఏర్పడుతున్నాయి.
బండిపోరాను భారీ హిమపాతం ముంచెత్తడంతో కొన్ని చోట్ల
అవలాంచ్లు ఏర్పడ్డాయి. భారీ మంచు కారణంగా బండిపోరా – గురేజ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం
ఏర్పడింది.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంచు తొలగించే పనులు
జరుగుతున్నాయి.
భారీ ఎత్తున మంచు ఒక్కసారిగా కొండలపై నుంచి కిందకు రావడాన్ని
అవలాంచ్ (మంచు తుపాను) అంటారు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణ నష్టం సంభవించే అవకాశం
కూడా ఉంది.