బీఆర్ఎస్
పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ను
వీడి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన భారతీయ జనతాపార్టీలో
చేరారు. పదేళ్ళుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పారు. వరంగల్
జిల్లాలో కార్యకర్తలతో కలిసి బీజేపీని
బలోపేతం చేస్తానని చెప్పారు. బీజేపీ లో చేరిక సందర్భంగా జై భారత్, జై మోదీ అంటూ
నినాదాలు చేశారు.
రెండు
రోజుల ముందే బీజేపీలో చేరేందుకు ఆరూరి రమేశ్ సిద్ధం కాగా, బీఆర్ఎస్ నేతలు ఆయనను
బలవంతంగా వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించారు. కేసీఆర్ తో భేటీ అనంతరం తాను బీఆర్ఎస్
లోనే కొనసాగుతానని చెప్పారు. మరుసటి రోజు రహస్యంగా దిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో
భేటీ అయ్యారు. శనివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.