సీఏఏ అమల్లోకి వచ్చాక మొదటి సారిగా అహ్మదాబాద్‌కు చెందిన 18 మంది పాకిస్థాన్ పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, 18 మందికి పౌరసత్వం అందించారు. 2016, 2018 నోటిఫికేషన్ ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు కచ్, గాంధీనగర్, అమ్మదాబాద్ జిల్లా కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని మోదీ కల నెరవేర్చడానికి అందరూ కృషి చేయాలని మంత్రి సంఘవి, పౌరసత్వం పొందిన వారికి కోరారు. భారత అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. భారత పౌరసత్వం పొందిన వారిని జనజీవన స్రవంతిలో కలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయని గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకున్న హిందూ, క్రిస్టియన్, జైనులు, పార్శీలకు సాధ్యమైనంత త్వరగా భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు.