చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం రాబోయే ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు, ఎన్నికల వాచ్ డాగ్ ,”నో యువర్ కాండిడేట్ ” (కేవైసి )అనే కొత్త మొబైల్ యాప్ ను ప్రారంభించిందని తెలిపారు. ఈ కొత్త మొబైల్ అప్లికేషన్ లో ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎవరైనా ఎన్నికల అభ్యర్థి కి నేర చరిత్ర ఉందో లేదో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ఫార్మ్స్ లో డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ అప్లికేషన్లు అందుబాటులో ఉంచినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు .
నేరచరిత్ర ఉన్న అభ్యర్థులకు ఉన్న ఆస్తులు, అప్పులను ఓటర్లు స్వయంగా చెక్ చేసుకోవచ్చని దానికి సంబంధించిన అన్ని వివరాలను ఈ అప్లికేషన్ లో అందుబాటులో ఉంచుతామని కమిషనర్ తెలిపారు. నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల టికెట్ ఇచ్చే పార్టీలు వారిని ఎందుకు ఎంపిక చేసాయో స్పష్టంగా పేర్కొనాలి అని, నేరచరిత్ర ఉన్న అభ్యర్థుల సమాచారాన్ని పబ్లిక్ డిమాండ్ లోకి తీసుకురావలసి ఉంటుందని ఆయన అన్నారు.
నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉందని, యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్నునుకూడ ఉపయోగించుకోవచ్చని, ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13న, ఎన్నికలు జరగనున్నాయి.