వేసవిలో
ఎండతీవ్రతకు విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం
తీసుకుంది. రేపటి(మార్చి18) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం
7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ
కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్,
మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలతో పాటు గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల
మేనేజ్మెంట్ లు ఒంటిపూట బడులు పక్కాగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం
చేశారు. మార్చి 18 నుంచి ఈ విద్యా సంవత్సరం ఆఖరి పనిదినమైన ఏప్రిల్ 23 వరకు
ఒంటిపూట బడులు నిర్వహించాల్సి ఉంది.
ప్రభుత్వ
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇళ్ళకు పంపుతారు. ఎస్ఏ2
పరీక్షల షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.
పాఠశాలల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ఓరల్ రీ హైడ్రేషన్ సొల్యూషన్
ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాలి. మధ్యాహ్న భోజన సమయంలో స్థానికుల సమన్వయంతో
మజ్జిగ అందించాలని విద్యాశాఖ సూచించింది.