ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కింద ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పది రోజులు తమ కష్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారం రోజుల కస్టడీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మే 23 వరకు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది.
మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వారం తరవాత కవితను మరోసారి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. తరవాత కోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. విచారణలో కవిత ఈడీ అధికారులకు సహకరించకుంటే మరలా వారు కస్టడీ కోరే అవకాశముందని తెలుస్తోంది. మే 23న మరోసారి కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు.