Assembly elections for three more states along with AP
లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల
శాసనసభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు మే 13న పోలింగ్
జరగనుంది. మిగతా మూడు రాష్ట్రాలూ ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం.
ఒడిషాలో మొత్తం 147 అసెంబ్లీ,
21 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. వాటికి నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి.
నాలుగవ దశ ఎన్నిక జరిగే మే 13న మొదటి విడత పోలింగ్ 28
అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకు జరుగుతుంది. ఐదవ దశ ఎన్నిక జరిగే మే 20న రెండవ
విడత పోలింగ్ 35 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలకు జరుగుతుంది.
ఆరవ దశ పోలింగ్ జరిగే మే 25న మూడవ విడత పోలింగ్ 42
అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు జరుగుతుంది. ఏడవ దశ పోలింగ్ జరిగే జూన్ 1న
నాలుగవ విడత పోలింగ్ 42 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు జరుగుతుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ, 2పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి.
వాటికి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. వాటన్నింటికీ మొదటి దశలోనే ఏప్రిల్ 19న
పోలింగ్ జరుగుతుంది.
సిక్కింలో 32 అసెంబ్లీ, 1 పార్లమెంటు
నియోజకవర్గాలున్నాయి. వాటికి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. వాటన్నింటికీ మొదటి
దశలోనే ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది.
వీటితో పాటు దేశంలోని 13
రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు కూడా ఈ సమయంలోనే జరుగుతాయి.
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి మే 13న ఎన్నిక
జరుగుతుంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన
బీఆర్ఎస్ అభ్యర్ధి లాస్యనందిత రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ ఎన్నిక
అనివార్యమైంది. తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలకు ఎన్నిక జరిగే నాలుగో దశ పోలింగ్‌లోనే
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభా నియోజకవర్గం ఎన్నిక జరుగుతుంది.