Election Schedule Announced
కేంద్ర ఎన్నికల సంఘం రాబోయే సార్వత్రిక ఎన్నికల
కోసం షెడ్యూల్ ప్రకటించింది.
పార్లమెంటు లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్
ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆ వివరాలను
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల తేదీలు, ఏ రోజు ఎన్ని నియోజకవర్గాలకు
ఎన్నికలు జరుగుతాయి అన్న వివరాలు ఇలా ఉన్నాయి….
లోక్‌సభలో మొత్తం 543 నియోజకవర్గాలు ఉన్నాయి.
మొదటి దశ (102) : 19 ఏప్రిల్ : 21 రాష్ట్రాలు
రెండవ దశ (89) : 26 ఏప్రిల్ : 13 రాష్ట్రాలు
మూడవ దశ (94) : 7 మే : 12 రాష్ట్రాలు
నాలుగవ దశ (96): 13 మే : 10 రాష్ట్రాలు
ఐదవ దశ (49) : 20 మే : 8 రాష్ట్రాలు
ఆరవ దశ (57) : 25 మే : 7 రాష్ట్రాలు
ఏడవ దశ (57): 1 జూన్ : 8 రాష్ట్రాలు
ఎన్నికల కౌంటింగ్ : 4 జూన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 నియోజకవర్గాలకు 4వ
దశలో అంటే మే 13న ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి.
వీటితో పాటు 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపయెన్నికలు
జరుగుతాయి.