బహుజన్
సమాజ్ వాదీ పార్టీ(BSP)కి
ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు.
అనంతరం కేసీఆర్ తో సమావేశమయ్యారు.
BRS-BSP పొత్తులో భాగంగా ఏనుగు గుర్తు పై నాగర్
కర్నూల్ నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ఇరు పార్టీలు ప్రకటించారు.
తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో బీఎస్పీ్సీ రెండు చోట్ల బీఆర్ఎస్ 15
స్థానాల్లో పోటీ చేయాలని పొత్తులో భాగంగా నిర్ణయం తీసుకున్నాయి. నాగర్ కర్నూల్ తో
పాటు హైదరాబాద్ లోక్ సభ స్థానంలో బీఎస్పీ బరిలో ఉంటారని ప్రకటనలో తెలిపారు. కానీ
ప్రకటన వచ్చి 24 గంటలు కూడా గడవకు ముందే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు
చేసుకుంది. బీఎస్పీకి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు
ప్రచారం జరుగుతోంది.
కవిత
అరెస్టును బీఎస్పీ ఖండిస్తుందని సోషల్ మీడియా వేదికగా తెలిపిన ప్రవీణ్ కాసేపటికే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున సిర్పూర్
కాగజ్ నగర్ నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి గెలవగా, బీఆర్ఎస్ రెండోస్థానంలో
నిలిచింది. ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.