అమితాబ్ బచ్చన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడంటూ వస్తున్న వార్తలను బిగ్ బీ కొట్టిపారేశాడు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్‌కు అమితాబ్ హాజరయ్యారు. దీంతో పుకార్లకు తెరపడినట్లైంది.
మీడియా అడిగిన ప్రశ్నలకు అమితాబ్ ఒపిగ్గా సమాధానం చెప్పారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగ్గా, చాలా బాగుందన్నారు. తాను అనారోగ్యానికి గురయ్యానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. మాజీ క్రికెటర్ సచిత్తో కలసి ఆయన క్రికెట్ మ్యాచ్ వీక్షించారు.
అమితాబ్ ఇప్పటికీ అనేక దక్షిణది చిత్రాల్లోనూ నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న కల్కి 2898 చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది మే 9న విడుదల కానుంది. తలైవా 170 కూడా అమితాబ్ మెరవనున్నారు.