ప్రధాని
నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన పదేళ్ళ పరిపాలన కాలాన్ని
పరిగణనలోకి తీసుకుని వికసిత భారత్ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
దేశ
ప్రజలను కుటుంబ సభ్యులుగా లేఖలో పేర్కొన్న ప్రధాని మోదీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన
పథకాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
పదేళ్ల
బీజేపీ పాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని
పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వ ప్రయత్నాల ఫలితమే ప్రస్తుత
అభివృద్ధి అని లేఖలో ప్రధాని మోదీ ప్రస్తావించారు.
దక్షిణాదిలో
ప్రధాని సుడిగాలి పర్యటన…
దక్షిణ భారతదేశంలో శుక్రవారం ప్రధాని మోదీ
సుడిగాలి పర్యటన చేశారు. తమిళనాడు, కేరళ, తెలంగాణలో పర్యటించి పలు అభివృద్ధి
కార్యక్రమాలను ప్రారంభించారు.
లోక్సభ
ఎన్నికల్లో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా మార్చి
19 వరకు 5 రోజులు పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా
543 పార్లమెంటు సీట్లు ఉండగా, దక్షిణాదిలో
130 స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 370 స్థానాలు గెలవడమే లక్ష్యంగా
పెట్టుకున్న బీజేపీ, ఎన్డీయే కూటమి కి 400 పైచిలుకు సీట్లు వస్తాయని
భావిస్తున్నారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్,
తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక్క సీటును బీజేపీ కైవసం చేసుకోవలేకపోయింది.
కర్ణాటకలో
మాత్రం 25 ఎంపీ సీట్లు తెలంగాణలో 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. ఈసారి
అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపరాడాలనే ఉద్దేశంతో స్థానిక పార్టీలతో
బీజేపీ పెత్తు పెట్టుకుంది. మెరుగైన
ఫలితాలు సాధించడంలో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కొత్త పొత్తులు
పెట్టుకుంది.
నేడు
తెలంగాణలోని నాగర్ కర్నూల్, కర్ణాటకలోని
గుల్బర్గాలో నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నారు. అలాగే రేపు (మార్చి 17) ఆదివారం
ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం, జనసేన , భారతీయ జనతా పార్టీ నిర్వహించే ఉమ్మడి
బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత 18న
తమిళనాడులో కోయంబత్తూర్లో ప్రధాని రోడ్ షో ఉంటుంది. అదే రోజు తెలంగాణలోని జగిత్యాల
కర్ణాటకలోని శివమొగ్గ లోను మోడీ ర్యాలీలు ఏర్పాటు చేసుకున్నారు. 19న కేరళలో పాలక్కడ్ లో రోడ్ షో, తమిళనాడు సేలం లో బహిరంగ సభ ఉంటాయి.