దిల్లీ లిక్కర్ స్కామ్ లో
ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. దిల్లీలోని రౌస్
అవెన్యూ కోర్టు, కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది.
లిక్కర్ స్కామ్ తో పాటు మనీలాండరింగ్
యాక్ట్ కింద విచారించేందుకు అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు
తాఖీదులు జారీ చేసింది.
ఈడీ నోటీసులను బేఖాతరు చేసిన కేజ్రీవాల్, తనను రాజకీయంగా
కట్టడి చేసేందుకే బీజేపీ ప్రొద్బలంతోనే నోటీసులు జారీ అవుతున్నాయని ఆరోపించారు.
తమ నోటీసులకు స్పందించకపోవడంతో
ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ విచారణలో భాగంగా నేడు విచారణకు వ్యక్తిగతంగా హాజరైన
కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రూ. 15 వేల వ్యక్తిగత పూచీకత్తు, రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్
చేయాలని ఆదేశించింది.
కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నివాసానికి చేరుకున్నారు.
లిక్కర్ స్కామ్ లోనే శుక్రవారం
రాత్రి అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు నేడు రౌస్ అవెన్యూ
కోర్టులోనే ప్రవేశపెట్టి కస్డడీకి అనుమతి తీసుకోనున్నారు.