ED officials detain BRS leader Kavita in Delhi liquor
scam
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
అధికారులు బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ
అగ్రనేత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌లో రోడ్ షో చేస్తున్న సమయంలోనే కవితను
అదుపులోకి తీసుకోవడం గమనార్హం. కవిత నివాసం దగ్గరకు హరీష్ రావు, కేటీఆర్ సహా
బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఈడీ అధికారులు కవితను ఢిల్లీ
తరలించే అవకాశముంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత నిందితురాలిగా
ఉన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వపు మద్యం విధానాన్ని ప్రభావితం చేసిన ‘సౌత్
గ్రూప్’లో కవిత కూడా ఉన్నారని ఈడీ ఆరోపణ. ఆ కుంభకోణంలో హైదరాబాద్‌కు చెందిన
వ్యాపారవేత్త శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీలోకి చేరిన తండ్రీకొడుకులు
మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి తదితరులు కూడా ఉన్నారు. వారిలో
శరత్‌చంద్రారెడ్డి, రాఘవరెడ్డి ఇప్పటికే అప్రూవర్లుగా మారారు.