దిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారుల
బృందం, హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో తనిఖీలు చేస్తున్నారు.
గత 10
ఏళ్ళలో కవిత జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఈడీ జాయింట్
డైరెక్టర్ నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతోంది.
కవితతో పాటు,
ఆమె సహచరుల మొబైల్స్ స్వాధీనం చేసుకున్న ఈడీ టీమ్, ఇతరులను లోనికి అనుమతించడం లేదు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
కవిత స్టేట్మెంట్ రికార్డు చేసిన ఈడీ, కీలక
డాక్యుమెంట్లను సీజ్ చేసింది.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో
ఉన్నప్పుడు ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం సరికాదని బీఆర్ఎస్ లీగల్
సెల్ నేత సోమ భరత్ అన్నారు. తనను లోనికి అనుమతించాలని భరత్ కోరగా ఈడీ అధికారులు
నిరాకరించారు.