సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘంలో పదవీ విరమణ చేసిన వారిని కమిషనర్లుగా నియమించడంపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.ఇటీవల ఖాళీ అయిన రెండు కమిషనర్ పదవులను పదవీ విరమణ చేసిన వారితో భర్తీ చేశారు. సుఖ్బీర్‌సింగ్, జ్ఞానేష్‌కుమార్‌లు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియామకం అయ్యారు.ఎన్నికల సంఘంలో కమిషనర్ల భర్తీలో సుప్రీంకోర్టు సీజేఐను మినహాయించడాన్ని పిటిషనర్ సవాల్ చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం 2023 ప్రకారం కొత్త కమిషనర్ల నియామకం చేపట్టలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మార్చి 21న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో సీజేఐని తొలగించి, కేంద్ర మంత్రిని చేర్చడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేయడం, అనూప్‌చంద్ర పాండే పదవి కాల పరిమితి ముగియడంతో, తాజాగా వారి స్థానంలో ఇద్దరు కమిషనర్ల నియామకం జరిగింది.కొత్త కమిషనర్ల నియామకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.