ఈవీఎంల
పనితీరును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను
సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంల కారణంగా ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు
జరుగుతున్నాయని పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని దీపాంకర్ దత్త, ఆగస్టిన్ జార్జ్ మాషిలతో కూడిన ధర్మాసనం
ఈ కేసును విచారించింది.
ఇప్పటికే అనేకమార్లు ఈ అంశానికి చెందిన పిటిషన్లు
కోర్టు దృష్టికి వచ్చాయని తెలిపిన ధర్మాసనం, ఈ మధ్యే వీవీప్యాట్‌కు చెందిన పిటిషన్లను
పరిశీలించామన్నారు, కేవలం ఊహాజనితాల ఆధారంగా విచారణ చేపట్టలేమి
తేల్చి చెప్పింది. ప్రతీ విధానంలో ప్లస్, మైనస్ ఉంటుందని, ఆర్టికల్ 32 కింద దీన్ని ఎంటర్‌టైన్ చేయలేమని
ధర్మాసనం వెల్లడించింది.
ఈవీఎంల పనితీరును
ప్రశ్నిస్తూ నందినీ శర్మ పిటీషన్ వేశారు. విచారణ సమయంలో కోర్టుకు వ్యక్తిగతంగా
హాజరయ్యారు. ఇతర పిటిషన్లను విచారిస్తున్న సమయంలోనే ఈవీఎంల గురించి
విస్తృతంగా పరిశీలించామన్న ధర్మాసనం తెలిపింది.
ఇటీవల
జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కూడా ఆ పార్టీ నేతలు విచిత్ర వాదనలు చేశారు.
ఈవీఎంలలో లొసుగుల కారణంగానే బీజేపీ గెలిచిందనే అర్థం వచ్చేలా కాంగ్రెస్ అగ్రనేత, మాజీ
సీఎం దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.