National Olema
Parliament supports CAA
పౌరసత్వ సవరణ
చట్టాన్ని నోటిఫై చేసి అమల్లోకి తీసుకురావడం మంచి పరిణామమని జాతీయ ఉలేమా
పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కల్బే రుషేద్ రిజ్వీ అన్నారు. దశాబ్దాల తరబడి ఎలాంటి
పత్రాలూ లేకుండా జీవిస్తున్న వారికి ఇది శుభవార్త అని, సీఏఏ అమలుకు ఎవరూ అభ్యంతరాలు
పెట్టకూడదనీ ఆయన అన్నారు.
‘‘భారతదేశమే
కాదు… నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లేదా ఇరాన్, ఏ దేశమైనా సరే చొరబాటుదార్లు నకిలీ
గుర్తింపుతో అక్రమంగా చొరబడితే అది ఆ దేశపు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుంది.
దాన్ని నివారించడానికే ఎవరికి సరైన పత్రాలున్నాయి, ఎవరికి లేవు అన్న సంగతి
తెలియాలి. ఏ డాక్యుమెంట్లూ లేకుండా దశాబ్దాల తరబడి ఇక్కడ బతుకుతున్న వారికిది
(సీఏఏ అమలు) శుభవార్త. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. అణచివేతకు గురైనవారే అణగదొక్కబడినవారు
అని మా షియా ముస్లిములకు బాగా తెలుసు. వారికి డాక్యుమెంట్లు ఇవ్వడానికి హోంమంత్రి,
ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అభినందించాలి’’ అని
కల్బే రుషీద్ రిజ్వీ వ్యాఖ్యానించారు.
‘‘ఒక వ్యక్తి ఈ దేశంలో
దశాబ్దాల తరబడి జీవిస్తుంటే అతనికి పాస్పోర్టు ఇవ్వవచ్చు. అదే, ఒక వ్యక్తి ఈ
దేశంలో దశాబ్దాల తరబడి జీవిస్తుంటే, అతని పూర్వీకులకు ఈ దేశంతో సంబంధం ఉంటే అతనికి
పౌరసత్వం ఎందుకు ఇవ్వకూడదు?’’ అని కల్బే రుషేద్ రిజ్వీ ప్రశ్నించారు.