Mudragada Padmanabham joins YSRCP
మాజీ మంత్రి, కాపు
ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ ఉదయం వైఎస్సార్‌సీపీలో
చేరారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో
పాటు ఆయన కొడుకు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎన్నికల్లో
జగన్ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ
ప్రాంతీయ సమన్వయకర్త పివి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి
చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి
ప్రవేశించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అందులో చేరారు. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1999లో టీడీపీ
నుంచి కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్
ప్రభుత్వాల్లో మంత్రిగానూ పని చేశారు. కాపు ఉద్యమ నేతగా పోరాడుతున్నారు. జనసేన
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టడానికి ముద్రగడను వైఎస్సార్‌సీపీ
ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే రోజు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ
యండపల్లి శ్రీనివాసులు రెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఆయన 2011, 2017లో తూర్పు
రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.